కోవిడ్‌ సేవలకు కేర్‌ టేకర్స్‌!

23 May, 2021 09:24 IST|Sakshi

హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలు, వారి కుమారుడికి ఒకేసారి కరోనా సోకింది. భర్త, కొడుకు ఇంటివద్దే ఉండి మందులు వాడుతున్నా.. భార్యను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. భర్త, కొడుకు ఆ మహిళతో ఉండలేని పరిస్థితి. ఆమెను చూసుకొనేందుకు అయినవారెవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూనే.. కేర్‌ టేకర్‌గా సేవలందిస్తున్న ఒక యువతి ముందుకొచ్చింది. ఆ మహిళ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు అండగా నిలిచింది. 

కోవిడ్‌ కేర్‌ టేకర్స్‌.. కుటుంబంలో అందరూ కరోనాబారిన పడి, బాధితులకు తోడుగా ఎవరూ లేని పరిస్థితుల్లో అన్నీ తామై సేవలు చేస్తున్న సహాయకులు. పేషెంట్‌తోనే ఉండి.. సమయానికి మందులు ఇవ్వడం, అవసరమైన సేవలు చేయడంతోపాటు త్వరగా కోలుకునేలా ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం రోజుకు ఇంత అని చార్జీలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఖర్చయినా.. దగ్గరుండి, సొంతవారిలా శ్రద్ధతో చూసుకోవడంతో మంచి ప్రయోజనం ఉంటోందని కరోనా బాధిత కుటుంబాలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

అన్ని జాగ్రత్తలతో.. 
తమ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని కేర్‌ టేకర్‌ సేవలు అందించే సంస్థలు చెప్తున్నాయి. మందులు, భోజనం వంటివి ఇస్తూ రోగి అవసరాలను కనిపెట్టుకోవడం, ఆక్సిజన్, రక్తపోటు, షుగర్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం, ఊపిరితిత్తులకు బలాన్నిచ్చే ప్రత్యేక వ్యాయామాలు చేయించడం, ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సె లింగ్‌ ఇవ్వడం తమ విధులు అని.. అవసరానికి అనుగుణంగా ఫీజులు ఉంటా యని తెలిపాయి. వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని కనిపెట్టుకొని ఉండేందుకు.. 24 గంటలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నట్టు మహిమ హోం హెల్త్‌కేర్‌ ఎండీ ప్రమీల చెప్పారు. ఇంటివద్ద అయితే రూ.6 వేల చొప్పున తీసుకుంటున్నట్టు తెలిపారు. 

రోగుల బాధలేమిటో తెలియడం వల్లే.. 
‘‘కోవిడ్‌ రోగులకు సపర్యలు చేసే క్రమంలో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్‌ మాకూ సోకే ప్రమాదం ఉంటుంది. నేను గత ఏడాది కోవిడ్‌ బారినపడ్డాను. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచి్చంది. ఆ ఒంటరితనం బాధ మాకు తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉంటూ సరీ్వసులు అందజేస్తున్నాం’’ అని ప్రమీల పేర్కొన్నారు. కేర్‌ టేకర్స్‌ అవసరమైన వారు 8919072177 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. తాము సేవను దైవంగా భావిస్తామని, రోగుల్లో భయాన్ని పోగొట్టి, భరోసాను కలి్పస్తామని.. వారు త్వరగా కోలుకోగలుగుతారని కేర్‌ టేకర్లు కవిత, కృష్ణవేణి చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డవారు కోలుకోవడం, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. 
–సాక్షి, హైదరాబాద్‌

సొంత బిడ్డలా  సేవ చేశారు 
ఐదు రోజుల పాటు కోవిడ్‌ కేర్‌ టేకర్ల సరీ్వసు తీసుకున్నామని, సొంత బిడ్డల్లా శ్రద్ధగా చూసుకున్నారని హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన రుక్మిణి చెప్పారు. రాత్రింబవళ్లు దగ్గరుండి, జాగ్రత్తగా చూసుకున్నారన్నారు. కేర్‌ టేకర్లు గంట గంటకూ తన అవసరాలు చూసుకున్నారని, వారు చెప్పే మాటలతో భయం పోయి ధైర్యంగా ఉండగలిగానని సికింద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మి చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు