సమయానికి దొరకని కత్తెర.. కేసీఆర్‌​ అసహనం

4 Jul, 2021 17:41 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎం కేసీఆర్‌ ఒకింత అసహనానికి గురవడంతో.. అధికారులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. సిరిసిల్లలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి.. కత్తెర అందుబాటులో లేకపోవడంతో కాసేపు కత్తెర కోసం సీఎం వేచి చూశారు. కత్తెర లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహంలోకి అడుగుపెట్టారు.
 

మరిన్ని వార్తలు