రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్‌

28 Nov, 2021 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు తమ వాయిస్‌ను గట్టిగా వినిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఎంపీల ఆధ్వర్యంలో ముఖ్యంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే తాము.. చాలా ఓపిక పట్టామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదీలేదని స్పష్టంచేశారు. కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడంలేదని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.  

మరిన్ని వార్తలు