చేపల కోసం వలేస్తే.. మొసలి చిక్కింది!

7 May, 2022 03:57 IST|Sakshi
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో  మత్స్యకారులకు చిక్కిన మొసలి 

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామశివారులోని పెద్దచెరువులో శుక్రవారం మత్స్యకారుల వలకు ఓ మొసలి చిక్కింది. చేపల పట్టుకునేందుకు కొందరు వలలు వేయగా.. ఆ వలలో మొసలి పడింది. మరికొందరితో కలిసి దానిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, ఫారెస్ట్‌ బీట్‌ అధికారి రత్నాకర్‌కు సమాచారం ఇచ్చారు.

సిబ్బందితో కలిసి వచ్చిన ఆయన మొసలిని తీసుకెళ్లారు. సమీప గోదావరి నదిలో విడిచి పెట్టారు. మొసలి వయసు సుమారు రెండేళ్లు ఉంటుందని, అరవై కేజీల బరువుంటుందని రత్నాకర్‌ తెలిపారు. కాగా, గ్రామ చెరువులో తొలిసారి మొసలి ప్రత్యక్షం కావడంతో మత్స్యకారులు కొద్దిగా ఆందోళన చెందారు. 

మరిన్ని వార్తలు