మావోయిస్ట్‌ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన

3 Sep, 2020 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై  గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే  నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. 

మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్‌లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్‌ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు  రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది.    ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్‌ ఏ ఆర్‌ సివిల్‌ పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. 

చదవండి: మావో‌ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్‌ సర్వే

మరిన్ని వార్తలు