27న సింగరేణి ఎన్నికలు

5 Dec, 2023 03:16 IST|Sakshi
రిటర్నింగ్ అ«ధికారి శ్రీనివాస్‌తోసమావేశమైన కార్మిక సంఘాల నేతలు

మొత్తం ఓటర్లు 39,748మంది జాబితా విడుదల

రిటర్నింగ్ అధికారితో నేతల సమావేశం 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

శ్రీరాంపూర్‌ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు.

ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు.  

8న తుదిజాబితా 
ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్‌ఎస్‌ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు.

ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిన ఈనెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్‌ బి.జనక్‌ప్రసాద్, హెచ్‌ఎమ్మెస్‌ అధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్, బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 

ఏరియాల వారీగా ఓటర్లు 
బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్‌లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్‌ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు.

>
మరిన్ని వార్తలు