'ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌దే గెలుపు'

3 Nov, 2020 20:31 IST|Sakshi

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి : ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రభుత్వం చేసిన మంచి పనులను మాత్రం విస్మరిస్తారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. మంగళవారం రోజున జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ('దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయం')

ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. వారికి సీఎం కేసీఆర్‌ త్వరలోనే శుభవార్త చెబుతారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి మాయదారి కరోనా వచ్చిందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారన్నారు. యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో​ కూడా అన్ని పంటలను కొనడంలేదన్నారు. మన రాష్ట్రంలో ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని వివరించారు. ఇకనైనా బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
 
లక్ష ఉద్యోగాలిచ్చాం : పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమోద్దన్నారు. ప్రతి పట్టభద్రుడు తప్పని సరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.    (కేసీఆర్‌ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం)

మరిన్ని వార్తలు