జనగామ: ఏసీ బస్సులో చెలరేగిన మంటలు

23 Jul, 2021 16:36 IST|Sakshi

సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ ఎక్కుతుండగా ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరిని కిందకు దింపేశాడు. దీంతో బస్సులో ప్రాయణిస్తున్న 29 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు