మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎంపీ రాపోలు.. కేసీఆర్‌తో భేటీ

24 Oct, 2022 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేసి, చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని, బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతానని సీఎం కేసీఆర్‌తో చెప్పారు.  రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద భాస్కర్‌ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

కాగా మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ వలస రాజకీయాలకు చెక్‌ పెట్టేందుకు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ పేరుతో కేసీఆర్‌ రచించిన మాస్టర్‌ ప్లాన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ దెబ్బతో కమలానికి గుడ్‌బై చెబుతూ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుకుంటున్నారు. ఇక ఇటీవల పల్లె రవికుమార్‌, స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌, బిక్షమయ్య గౌడ్‌, పనస రవికుమార్‌ వంటి వారు టీఆర్‌ఎస్‌ కండువా కప్పకున్న సంగ తితెలిసిందే.
చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు

మరిన్ని వార్తలు