విజయ డెయిరీ ద్వారా ఉచిత పాలు: తలసాని 

5 Oct, 2021 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఏటా రూ.17 లక్షలను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద అఫ్జల్‌గంజ్‌ చుడిబజార్‌లో నిర్వహిస్తున్న రెయిన్‌బో హో మ్‌కు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా పాల ను సరఫరా చేసేలా అనుమతిస్తూ జారీచేసిన పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు.

సొసై టీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హోమ్‌లో ఉన్న 93 మంది బాలికల కోసం ప్రతిరోజూ 20 లీటర్ల చొప్పున పాలను సంవత్సరంపాటు ఉచితం గా సరఫరా చేయనున్నట్లు చెప్పారు. సొసైటీ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి, శివరాణిలు మం త్రి చేతుల మీదుగా ఉచిత పాల సరఫరాకు సంబంధించిన పత్రాన్ని అందుకున్నారు.  

మరిన్ని వార్తలు