Anthrax At Warangal: ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం: మటన్‌ కొంటున్నారా..? జర జాగ్రత్త!

27 Oct, 2021 11:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దుగ్గొండి(వరంగల్‌): గ్రామాలలో గొర్రెలు చనిపోతే వాటిని మాంసం కోసం విక్రయించడం చేయవద్దని వాటిని గొయ్యి తీసి పాతిపెట్టాలని అధికారులు తెలిపారు. చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఓపెన్‌ చేసి మాంసాన్ని విక్రయించడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు చేరి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. వరంగల్‌ జిల్లా చాపలబండా గ్రామంలోని గొర్రెల మందలో ఆంత్రాక్స్‌ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాతపడిన విషయం విధితమే. 

వరంగల్‌ చాపలబండలో ఆంత్రాక్స్‌ వ్యాధితో నాలుగు గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో మాసం కొనేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంత్రాక్స్‌ వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తాకడం, తినడం, కొనడం చేయవద్దన్నారు.
చదవండి: లీటర్‌​ పెట్రోల్‌ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్‌!

మేక/గొర్రెను కోసినప్పుడు వచ్చే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించాలన్నారు. అలాగే కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని సూచించారు. చనిపోయి ఉన్న మూడు గొర్రెలను వెంటనే పాతిపెట్టాలన్నారు. అవి చనిపోయిన ప్రదేశంలో పడిన రక్తంపై ఎండు గడ్డివేసి మంట పెట్టాలని సూచించారు. అనంతరం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలన్నారు. అధైర్య పడవద్దని ఆంత్రాక్స్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రెలు ఉన్న మందను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కాపరులు గొర్రెలకు కొంత దూరంగా ఉండి మేపాలన్నారు.
చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్‌.. హెల్మెట్‌ డాక్టర్స్‌!

అజాగ్రత్తగా ఉంటే మనుషులకు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామంలో మిగిలిన 1200 గొర్రెలకు వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని స్థానిక వైద్యాధికారి శారదకు సూచించారు. చాపలబండలో ఐదేళ్ల పాటు ప్రతి 9 నెలలకోసారి గొర్రెలు, మేకలకు ఆంత్రాక్స్‌ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందన్నారు. గొర్రెలన్నింటిని కొన్ని రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు