పాత తూకం యంత్రంతో రైతులకు భారీ టోకరా

24 May, 2021 10:00 IST|Sakshi
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులు

కొనుగోలు కేంద్రంలో మోసం

ప్రతీ బస్తాపై అదనంగా 8 కిలోలు ఎక్కువగా ధాన్యం తూకం

కాట్రియాల కేంద్రం వద్ద రైతుల ఆందోళన

రామాయంపేట (మెదక్‌): మండలంలోని కాట్రియాల గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. దీంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. ఎల్రక్టానిక్‌ తూకం యంత్రానికి బదులుగా పాత తూకం యంత్రం వినియోగించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రతీ తూకానికి 40 కిలోలకు బదులుగా 48 నుంచి 50 కిలోల వరకు అక్రమంగా తూకం చేసుకొని రైతులను మోసగించారు.

కాగా రైతులకు తెలియకుండానే ఒక్కో తూకం (40 కిలోలు)లో ఎనిమిది నుంచి పది కిలోల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు పదివేల బ్యాగుల వరకు తూకం వేయగా, ఇందులో సుమారుగా ఐదు వేల బ్యాగులను పాత కాంటాపై తూకం చేశారు. ఈ లెక్కన రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కాగా ఎవరి ప్రోద్బలంతో తూకం వేసిన హమాలీలు ఈ మోసానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది.

బయటపడింది ఇలా..
సాయంత్రం మ్యాన్యువల్‌ కాంటాతో ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో అనుమానించిన కొందరు రైతులు ఈ కాంటాతో తూకం వేసిన బస్తాలను కొన్నింటిని ఎల్రక్టానిక్‌ తూకం యంత్రంపై తూకం వేయగా, ఈ మోసం బయటపడింది.  దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వందలాది మంది కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకొని వచి్చన పోలీసులు రైతులను శాంతపర్చారు.

చదవండి: సీఎం కేసీఆర్‌ సొంత జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న

మరిన్ని వార్తలు