జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్‌ భేటీ..

27 Aug, 2022 19:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్‌‌ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్‌ పర్యటనను పూర్తి చేసుకున్న నడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్‌ చేరుకొని హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్‌, రామచంద్రరావు ఉన్నారు. 

నితిన్‌తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా సమావేశమయ్యారు. 
చదవండి: అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా? కిషన్‌ రెడ్డి ఫైర్‌

మరిన్ని వార్తలు