ఇక ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం: కేటీఆర్‌

29 May, 2021 16:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న‌గ‌రంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వ‌చ్చాయి.‍ రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ ఉప్ప‌ర్‌ప‌ల్లిలో పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కనెక్టివిటీగా నిర్మించిన ర్యాంపును  శ‌నివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ర్యాంపు ద్వారా ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం కలిగిందని అన్నారు.  రూ. 22 కోట్ల‌తో అత్తాపూర్ పిల్ల‌ర్ నెంబ‌ర్ 164 ద‌గ్గ‌ర ర్యాంపుల నిర్మాణం జ‌రిగింది. ఈ ర్యాంపును హెచ్‌ఎండీఏ సంస్థ నిర్మించింది.

ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్ర‌యాణికులు ఉప్ప‌ర్‌ప‌ల్లి వ‌ద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్‌, ఇత‌ర ప్రాంతాల‌కు త్వరగా చేరవచ్చని ఆయన తెలిపారు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రన‌గ‌ర్‌, ఉప్ప‌ర్‌ప‌ల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ త‌గ్గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్‌ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అరవింద్ కుమార్‌, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్ర రెడ్డి, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి, నగర మేయర్ జి విజయ లక్ష్మి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

చదవండి: వృద్ధాప్య పింఛన్‌ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు

మరిన్ని వార్తలు