చార్మినార్‌ వద్ద మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌

5 Jul, 2022 18:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద త్వరలో మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఓ స్థలంలో ఘన వ్యర్థాలను పడవేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోందని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయడంతో ఆయన ఈ జవాబిచ్చారు.

ఈ పనులు చేపట్టేందుకు డిజైన్లు రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రతినిధుల బృందం ఇటీవల కోయంబత్తూర్‌ని సందర్శించి మల్టీ లెవల్ కారు పార్క్‌ విధానాన్ని అధ్యయనం చేసిందని వెల్లడించారు. (క్లిక్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి)

మరిన్ని వార్తలు