చంద్రబాబు అరెస్ట్‌ సక్రమమే.. మా సపోర్ట్‌ సీఎం జగన్‌కే: ఐటీ ఉద్యోగులు

17 Sep, 2023 13:45 IST|Sakshi

సాక్షి, మేడ్చల్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం కరెక్టే అంటూ ఐటీ ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తూ కార్ల ర్యాలీ తీశారు. 

ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కార్లలో ర్యాలీ చేపట్టారు. తమ కార్ల ర్యాలీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు సాగుతుందని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎవరెన్ని మాట్లాడినా మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్‌ ప్రభుత్వమే.  చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. నిన్న ఓఆర్‌ఆర్‌పై పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబుకు మద్దుతుగా ర్యాలీ చేశారు. అచ్చెన్నాయుడు.. ప్లీజ్‌.. ప్లీజ్‌ అని బ్రతిమాలుకుంటే, దండ పెడతాను అంటే వారు ర్యాలీ చేపట్టారు. ఓఆర్‌ఆర్‌ కట్టింది.. తెచ్చిందే వైఎస్సార్‌. ఇక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదు.

రానున్న కాలంలో చంద్రబాబు జైల్లోనే ఉంటారు. హైటెక్‌ సిటీ కమాన్‌ ఒక్కటే చంద్రబాబు కట్టారు. పక్కన ఫైనాన్‌షియల్‌ డిస్ట్రిక్‌, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్‌, కేసీఆర్‌ హయాంలోనే. వైఎస్సార్‌ ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు వచ్చాయి. చంద్రబాబు చేసిందేమీలేదు. స్కామ్‌ ప్రూవ్‌ అయ్యింది కాబట్టే.. కోర్టు రిమాండ్‌ ఇచ్చింది కాబట్టే.. చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఎంత మంది వచ్చినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. సీఎం జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు ఇది ఫిక్స్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఫేక్‌ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్‌’

మరిన్ని వార్తలు