Jadcherla: 12 గంటలు.. ఓ బ్రిడ్జి!

14 Jun, 2021 08:24 IST|Sakshi
ఉదయం: 9.30 గంటల సమయంలో ఇలా

ఇదో ‘ట్రాక్‌’ రికార్డు

జడ్చర్ల టౌన్‌/మహబూబ్‌నగర్‌: కేవలం 12 గంటల్లోనే ట్రిపుల్‌ ట్రాక్‌ బ్రిడ్జిని నిర్మించి రైల్వేశాఖ రికార్డు సృష్టించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోపు బ్రిడ్జి పనులు పూర్తిచేసి ట్రాక్‌ను పునరుద్ధరించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణంలోని గౌడ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో రైల్వేశాఖ ఈ బ్రిడ్జిని నిర్మించింది.  సుమారు 200 మంది అధికారులు, కూలీలు, ఇంజనీర్లు ఈ పనుల్లో పాలుపంచుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో ట్రిపుల్‌ ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారని ఇంజనీరింగ్‌ విభాగం ఏజీఎం మూర్తి తెలిపారు. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉందానగర్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనుల్లో భాగంగా అధికారులు ఈ బ్రిడ్జిని నిర్మించారు.  


మధ్యాహ్నం: 1.40 గంటలు

సాయత్రం: 5.30 గంటలు

చదవండి: చేర్యాలలో లజ్జా గౌరీ శిల్పం

మరిన్ని వార్తలు