కామారెడ్డి రైతుల సంచలన నిర్ణయం.. వారు రాజీనామా చేయాలని హెచ్చరిక

17 Jan, 2023 15:13 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ రద్దుపై పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

కాగా, రైతుల సమావేశంలో ఎల్లుండి(గురువారం) సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు ఇచ్చారు. 19న విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ తీర్మానం చేయించి మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకీ రాజీనామా పత్రాలు అందజేశారు.  

ఇదిలా ఉండగా.. కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రామేశ్వరపల్లికి చెందిన బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. నిర్మల్‌లో పాత రోడ్లనే బాగు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు