నెలాఖరులోగా గ్రిడ్‌కు ‘సూపర్‌ థర్మల్‌’! 

15 Aug, 2023 03:24 IST|Sakshi

27 నుంచి ఎన్టీపీసీ యూనిట్‌–1లో పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి 

విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు స్లాట్లను కేటాయించిన ఎల్డీసీ 

వచ్చే అక్టోబర్‌లో రెండో యూనిట్‌కు సీఓడీ ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్‌ను ఈ నెలాఖరులో గా గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్‌ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్‌ ఆపరేటింగ్‌ డేట్‌/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్‌ కేంద్రాన్ని గ్రిడ్‌ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్‌లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 27 నుంచి గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కోలోని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్‌ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్‌లో రెండో యూనిట్‌కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది.  

నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! 
ఎన్టీపీసీ తొలి యూనిట్‌ నుంచి జూన్‌ 2020, రెండో యూనిట్‌ నుంచి నవంబర్‌ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్‌ గడువును 2023 మార్చి, రెండో యూనిట్‌ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్‌–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్‌లోని రీహీటర్‌ ట్యూబ్స్‌కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్‌లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్‌కు పగుళ్లు వచ్చి న చోట కట్‌ చేసి వెల్డింగ్‌తో మళ్లీఅతికించారు.

ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్‌ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు.

డిస్కంలకు ఊరట..! 
ఎన్టీపీసీ తొలి యూనిట్‌ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్‌ డిమాండ్‌ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్‌ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్‌ అందుబాటులోకి వస్తే విద్యుత్‌ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు.  

మరిన్ని వార్తలు