ఏజెన్సీకి వైద్యాధికారులు

16 Sep, 2023 02:30 IST|Sakshi

‘సాక్షి’ కథనానికి స్పందన

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలపై శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఏజెన్సీకి ఫీవర్‌’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో  వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మహాముత్తారం మండలకేంద్రంతోపాటు అటవీ గ్రామాలైన సింగారం, పోలారం ప్రేమ్‌నగర్‌ తండాల్లో  మండల వైద్యాధికారి సందీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరించారు.

ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలో వైద్యశిబిరం నిర్వహించి 100మందికి మందుల కిట్‌ అందజేశారు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సందర్శించి రోగులను పరీక్షించారు. తాడ్వాయి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మేడారం, గంగారం గ్రామాల్లో, కొడిశాల పీహెచ్‌సీ  ఆధ్వర్యంలో ఎల్బాక, పడిగాపూర్‌ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. మంగపేట మండలంలోని నర్సింహాసాగర్, అకినేపల్లిమల్లారంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు