మూడు రోజులు మంటలే!

6 May, 2022 03:12 IST|Sakshi

అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతావరణ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని.. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది.

గురువారం రాష్ట్రంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీలుగా.. అతితక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత హైదరాబాద్‌లో 20.4 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. విదర్భ నుంచి తెలం గాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని.. దాని ప్రభావంతో రెండ్రోజుల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయంది.  

మరిన్ని వార్తలు