మరో రెండ్రోజులు భగభగలే..

3 Jun, 2022 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది.

కాగా, నైరుతి రుతుపవనాలు వాయవ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో  రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు