కన్నీటి పర్యంతమైన మంత్రి జగదీశ్‌రెడ్డి..

8 Apr, 2021 12:42 IST|Sakshi

సాక్షి, నల్గొండ : పెద్దవూర మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కర్నాటి విజయభాస్కర్‌ రెడ్డి అకాల మరణం తట్టుకోలేక మంత్రి జగదీశ్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధూంధాం నిర్వహించారు. ముందుగా విజయభాస్కర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వేదిక మీద వక్తలు విజయ భాస్కర్‌రెడ్డి పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటున్న క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు. మండలంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ, మంత్రి అనుచరుడిగా విజయభాస్కర్‌రెడ్డి గుర్తింపు పొందారని కొనియాడారు.  కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డిని చూసి రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్,రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ సైతం  ఉద్వేగానికి లోనయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు