‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది’..ఎంపీ సంతోష్ ఆసక్తికర ట్వీట్‌

7 Dec, 2021 17:59 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం  44వ పుట్టిన రోజు  జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌కు ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. సంతోష్‌ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అన్న విషయం తెలిసిందే.  ఈ మేరకు ఆయన ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. 

కాగా త‌న పుట్టిన రోజును పురస్కరించుకొని సంతోష్ కుమార్ ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. కేసీఆర్ సంతోష్ కుమార్‌ను భుజాల‌పై ఎత్తుకుని ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు. ఈ పుట్టుక నాది.. బ్ర‌తుకంతా మీది.. అని రాశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. కాగా సంతోష్‌ తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళ.. సంతోష్‌ తల్లి, సీఎం కేసీఆర్‌ భార్య శోభా సొంత అక్కా చెల్లెల్లు. పెద్దనాన్న కేసీఆర్‌తో సంతోష్‌కు అనుబంధం ఎక్కువే. అప్పటి నుంచి కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశారు.
చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి

మరిన్ని వార్తలు