ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ

30 Sep, 2022 11:20 IST|Sakshi

సాక్షి, నల్గొండ: వ్యవసాయ శాఖలో ఉత్తమ ఏవోగా పేరుపొందాడు.. కానీ తన అనైతిక ప్రవర్తనతో చివరికి కటకటాల పాలయ్యాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్‌రెడ్డి మహిళల ఫొటోలు తీసి.. ‘ఈమె ఎలా ఉంది’.. అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఈ విషయం సంబంధిత మహిళలకు తెలియడంతో ఆయనపై నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలలో నిందితుడు పెట్టిన పోస్టులను పరిశీలించిన పోలీసులు విజయ్‌రెడ్డిని అరెస్టు చేశారు. విజయ్‌రెడ్డిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు