చెన్నూర్‌లో వింత శిశువు జ‌న‌నం

9 Aug, 2020 09:16 IST|Sakshi

సాక్షి, చెన్నూర్‌: ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వింత శిశువు జ‌న్మించింది. కానీ పుట్టిన గంట‌కే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అరుణ‌శ్రీ వివ‌రాల ప్ర‌కారం.. కోట‌ప‌ల్లి మండ‌లం లింగ‌న్న‌పేట గ్రామానికి చెందిన ప్రియాంక శ‌నివారం ఉద‌యం ప్ర‌సూతి కోసం ఆస్ప‌త్రిలో చేరింది. సాధార‌ణ ప్ర‌స‌వంలో మ‌గ శిశువు పుట్టింది. శిశువు నుదుటిపైన ఒంటి క‌న్నులాంటి అవ‌య‌వం ఉండ‌టంతో గంట‌కే మృతి చెందింది. జ‌న్యుప‌ర‌మైన లోపంతో ఇలాంటి వింత ఆకారంలో శిశువులు పుడుతార‌ని వైద్యులు తెలిపారు. ఆసంప‌ల్లి ప్రియాంక శంక‌ర్ దంప‌తుల‌కు మొద‌టి కాన్పులో అమ్మాయి పుట్టింది, రెండో కాన్పులో మ‌గ బిడ్డ వింత రూపంతో పుట్ట‌డంతో పాటు గంట‌కే మృతి చెంద‌డంతో దంప‌తులు క‌న్నీటి ప‌ర్యాంత‌మ‌య్యారు. (నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు