మాజీ తహసీల్దార్‌ నాగరాజు వీడియో కాల్‌?!

17 Oct, 2020 14:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్‌ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్‌లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్‌ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు)
(చదవండి: కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య!)

మరిన్ని వార్తలు