టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు..

24 May, 2023 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లుగా ఉన్న రాహుల్, శాంతి, సుచరితలను సిట్‌ విచారిస్తోంది. నిందితులను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. చంచల్ గూడ నుండి నిందితులను కస్టడీని తీసుకుని సిట్ విచారిస్తోంది. మరో వైపు సిట్‌ ముందు విచారణకు రేణుకా హజరుకానుంది.

ఇప్పటికీ యుజర్ ఐడి, పాస్ వర్డ్ వ్యవహారం కొల్లిక్కి లేదు. కస్టోడియన్ శంకర్‌ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు శంకర్ లక్ష్మి కేవలం సాక్షిగా సిట్ పరిగణించింది. తవ్వేకొద్దీ నిందితుల పాత్ర బయట పడుతోంది. ఇప్పటి వరకు 37 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. మరికొంత మందికి పరీక్ష కంటే ముందే  పేపర్ వెళ్లినట్టు సిట్‌ గుర్తించింది. అరెస్ట్‌ల సంఖ్య 50కి చేరుకునే అవకాశం ఉంది.
చదవండి: కాంగ్రెస్‌.. మోదీ.. మధ్యలో కేటీఆర్‌ అదిరిపోయే ఎంట్రీ

కాగా, టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో బోర్డుపై సిట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్‌ అధికారులు సీరియస్‌ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్‌ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్‌ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్‌.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది.

మరిన్ని వార్తలు