వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ

16 Nov, 2021 12:34 IST|Sakshi

విదేశీ కొలువులకు ఏటా 20 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించి ఏటా వేలాది మంది డిగ్రీలు అందుకుంటున్నారు. వీరిలో సుమారు 20 వేల మందికి పైగా పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో డిగ్రీలు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు అసలివా? నకిలీవా? అని తెలుసుకునేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు పరిశీలన కోసం ఢిల్లీలోని వివిధ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయి. (చదవండి: కోటితో ఆగను.. అదే నా స్వప్నం: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ విజేత)

ఢిల్లీలోని ఏజెన్సీ సంస్థలు ఓయూకు రూ.500 చెల్లించి నేరుగా వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తాయి. హాల్‌టికెట్‌ నంబర్‌ ద్వారా సర్టిఫికెట్‌ డూప్లికేటా, ఒరిజినలా అని పరిశీలించి ఏజెన్సీ సంస్థలకు ఎయిర్‌లైన్స్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేసి సర్టిఫికెట్‌ను చేరవేస్తారు. అలా ప్రతిరోజూ 50కిపైగానే వెరిఫికేషన్‌ కోసం ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేస్తారని ఓయూ మాజీ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ వివరించారు. జూన్, జులై నెలల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. వెరిఫికేషన్‌లో జాప్యం కారణంగా ఎంతో మంది అభ్యర్థులు విదేశాల్లో ఉద్యోగాలకు దూరమవుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్‌ బాలిక)

మరిన్ని వార్తలు