22 నుంచి హైకోర్టులో భౌతిక విచారణ

20 Feb, 2021 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సూచించిన కరోనా నిబంధనల మేరకు హైకోర్టులో ఈనెల 22 నుంచి మార్చి 19 వర కు పాక్షికంగా భౌతికంగా, ఆన్‌లైన్‌ విధానంలో కేసులను విచారించనున్నారు. సోమ, మంగళ వారాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరాం భౌతి కంగా కేసులను విచారించనున్నారు. బుధ, గురువారాల్లో జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌ నాథ్‌గౌడ్‌లు భౌతికంగా కేసులను విచారి స్తారు. శుక్రవారం రోజు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌లతో కూడిన ధర్మా సనం, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డిలు కేసులను విచారిస్తారు. వారంలో రెండు రోజుల చొప్పున న్యాయమూర్తులు కేసులను భౌతికంగా.. మిగిలిన రోజులు ఆన్‌లైన్‌లో విచారిస్తారు. జస్టిస్‌ పి.కేశవరావు మాత్రం ఆన్‌లైన్‌లో మాత్రమే విచారిస్తారు. కాగా, మార్చి 1 నుంచి జిల్లా స్థాయి కోర్టుల్లో కేసులను భౌతికంగా మాత్రమే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 

మరిన్ని వార్తలు