పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిండ్రు..

19 Oct, 2021 09:20 IST|Sakshi

సాక్షి, వీణవంక(కరీంనగర్‌): వీణవంక మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ ధూంధాం కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోట నిరోష ఉద్యోగ ప్రకటనపై ప్రశ్నించగా.. నాయకులు, పోలీసులు ఆమెను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సోమవారం సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని అడిగినందుకు అక్కడ ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ వాళ్లు రూ.10 లక్షలు ఇచ్చి పంపించారా అంటూ బెదిరించినట్లు ఆరోపించింది. అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొటట్టారని.. మెడలో ఉన్న గోల్డ్‌ చైన్‌ కూడా పోయిందని చెప్పింది. చేతులు, కాళ్లు పట్టుకొని కదలనివ్వకుండా చేశారని.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు కేసీఆర్‌కు తొత్తులుగా మారారంటూ వీడియోలో కంటతడి పెట్టింది.   

చదవండి: పచ్చని సంసారంలో కేసీఆర్‌ నిప్పు పెట్టారు 

మరిన్ని వార్తలు