బండి సంజయ్‌కి తొలిసారి పోలీసు భద్రత

22 Jun, 2022 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి మొదటిసారి పోలీసు భద్రత కల్పించారు. హైదరాబాద్‌ నగర పరిధిలో ఆయ నకు వన్‌ ప్లస్‌ ఫైవ్‌ భద్రత (ఒక హెడ్‌ కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు)తో పాటు రోప్‌ పార్టీ ఏర్పా టుచేశారు. దీనితో పాటు అదనంగా ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని సైతం ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీ య కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం సమీక్షించిన సందర్భంగా సంజయ్‌కు ఈ భద్రత కల్పించారు.

ఇటీవల కరీంనగర్‌లో ఒక కార్యక్రమం సందర్భంగా సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు ముప్పు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. దీంతో పాటు ‘అగ్నిపథ్‌’పై నిరసనలు, వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ, ప్రధాని సభ వంటి కార్యక్రమాలు ఉన్నందున సంజయ్‌కు భద్రత కల్పించాలని నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు