కేసీఆర్‌ గురి పెడితే టీఆర్‌ఎస్‌కు గెలుపు ఖాయం

30 Sep, 2020 14:55 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ గురి పెడితే ఏ ఎన్నికైన టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమంలో మంత్రి పువ్వాడ పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో పట్టభద్రులకు చెప్పాలని అన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు తీసుకొని రావటం ద్వారా ఎక్కువ శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కలిగిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్‌ఓటీని ప్రారంభించిన మంత్రి పువ్వాడ
అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఎల్‌ఓటీని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనాతో భయపడొద్దని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని మంత్రి పిలుపునిచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. శాశ్వత ఆక్సిజన్ ట్యాంక్‌తో కష్టాలు తొలగాయన్నారు. త్వరలో రూ.50 లక్షలతో రాష్ట్రంలో రెండో ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు