కోతిని మింగి..చనిపోయి

16 Oct, 2022 02:42 IST|Sakshi

దండేపల్లి (మంచిర్యాల): ఓ కోతిని మింగి... కొండచిలువ చనిపోయిన ఘటన  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్‌ గ్రామంలో జరిగింది. కదలకుండా పడి ఉన్న కొండచిలువ చుట్టూ కొన్ని కోతులు చేరి అరుస్తుండటంతో గ్రామస్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కొండచిలువ చనిపోయి ఉంది. అది మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించింది. కోతిని మింగడం వల్ల మిగతా కోతులు దాడి చేసి ఉంటాయని, ఆ దాడిలో అది చనిపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు