బయోమెట్రిక్‌ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు 

10 Dec, 2022 09:19 IST|Sakshi

సాక్షి, వెల్గటూర్‌(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్‌ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్‌ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు.

వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే..  ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  

(చదవండి: స్టూడెంట్‌ లీడర్‌ టు మాస్‌ లీడర్‌.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి)

మరిన్ని వార్తలు