ఉత్తమ ఇంక్యుబేటర్‌గా ‘టీ హబ్‌’

17 Jan, 2023 01:45 IST|Sakshi

2022 జాతీయ స్టార్టప్‌ అవార్డుల ప్రదానం.. ఢిల్లీలో అవార్డు స్వీకరించిన టీ హబ్‌ సీఈఓ 

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్‌’కు ‘బెస్ట్‌ ఇంక్యుబేటర్‌ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం ఢిల్లీలో ‘నేషనల్‌ స్టార్టప్‌ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు. టీ హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు.

వివిధ రాష్ట్రాలు అవార్డుల కోసం పోటీ పడగా అవార్డు విజేతల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందిన స్టార్టప్‌లు 33 శాతం విజే తలుగా నిలిచాయి. 17 రంగాల్లో 42 స్టార్టప్‌లు అవార్డులు సాధించగా కర్ణాటక 18, మహారాష్ట్ర 9, ఢిల్లీ 4, గుజరాత్‌ 3, ఉత్తరాఖండ్‌ 2, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరి యాణా, అస్సాం ఒక్కో అవార్డును పొందాయి. జాతీయ స్థాయిలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా, టీ హబ్‌కు ఉత్తమ ఇంక్యుబేటర్‌ అవార్డు దక్కింది. టీ హబ్‌కు అవార్డు రావడంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు