నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్‌.. లింకులపై ఎక్సైజ్‌ పోలీసుల ఆరా

26 Dec, 2022 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు.. కొండల్‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 

 కొండల్‌రెడ్డితో పాటు మరో ప్రధాన నిందితుడు బాలరాజ్‌గౌడ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఇబ్రహీంపట్నంకు తరలిస్తున్నారు. 

ఆ మధ్య జరిగిన నల్లగొండ మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ.. నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు.  డిసెంబర్‌ 16వ తేదీన ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి.. అస్వస్థతకు గురైన విషయాన్ని ఎక్సైజ్‌ పోలీసులు గుర్తించారు. ఆపై ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. 

ఐబీ, ఓసీ లాంటి బ్రాండ్‌లకు నకిలీ లిక్కర్‌ను ఒడిషా తయారు చేస్తున్నారు. వాటిని తెలంగాణ శివారు ప్రాంతాలకు తరలించి.. రంగారెడ్డి, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారానికి గతంలో పాతిక మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ స్కామ్‌లో వీళ్లిద్దరి పాత్ర, లింకులపై ఇప్పుడు ఎక్సైజ్‌ పోలీసులు తేల్చాల్సి ఉంది.

మరిన్ని వార్తలు