Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

14 Dec, 2023 15:03 IST|Sakshi

Live Updates..

తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా 

రేపు అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగం

ముగిసిన కేబినెట్‌ సమావేశం

  • ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం
  • గవర్నర్‌ స్పీచ్‌కు కేబినెట్‌ ఆమోదం
  • రేపు అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగం


 

అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

  • తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు
  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్‌.. 

  • స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు
  • సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని సమస్యలు గడ్డం ప్రసాద్‌కు తెలుసు.
  • స్పీకర్‌గా ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం సహాకరించిన ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు
  • గడ్డం ప్రసాద్ సభను ఉన్నతంగా నడుపంతారనే నమ్మకం ఉంది


సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 

  • శాసనసభ దేవాలయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో అందరు భాగస్వాములు కావాలి
  • ప్రజలు కేంద్రీకృతంగా ప్రజా సమస్యలపై శాసనసభ పని చేయాలి.
  • గత స్పీకర్లు శాసనసభ పాటించిన విలువలు కాపాడుతూ మీరు మరింత వన్నె తేవాలి.
  • కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక్క ఎమ్మెల్యే ఉండటం విచారకరం.
  • ప్రజా సమస్యల పరిష్కారానికి మాకు కూడా సమయం కేటాయించాలి.
  • మీ కనుసైగల ద్వారానే ఆవేశాలు తగ్గుతాయని, సమస్యల పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నాను. 

మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 

  • స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారు.
  • స్పీకర్‌గా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు.
  • మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలాగే సభ హక్కులను కాపాడాలని కోరుతున్నా.
  • సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలి.
  • గతంలో చేనేత మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. 

  • అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కి అభినందనలు
  • శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తాడని స్పీకర్‌పై పూర్తి నమ్మకం ఉంది
  • విపక్షాలు స్పీకర్‌ ఎన్నికకు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు
  • స్పీకర్ నిర్ణయాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది
  • మా తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఎంతో ఔన్నత్యం తీసుకొచ్చాడు

భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

  • గడ్డం ప్రసాద్‌ ఎన్నిక స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చింది.
  • గడ్డం ప్రసాద్‌ చేనేత మంత్రిగా చేనేతల అభివృద్ధికి కృషి చేశారు.
  • ప్రజా సమస్యలపై, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నాను.
  • స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు. 

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..
స్పీకర్‌ ఎన్నిక విషయంలో సానుకూలంగా సహకరించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ది, నాది సొంత జిల్లా వికారాబాద్‌. సభలో చర్చ జరిగి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. గడ్డం ప్రసాద్‌ అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్‌ సేవలందించారు.

  • వికారాబాద్‌కు ఎంతో విశిష్టత ఉంది.
  • వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు.
  • సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా.
  • గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు.
  • కింది స్థాయి నుండి స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎదిగారు.
  • వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్‌ది చెరగని ముద్ర.

►తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

►గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి,

►స్పీకర్‌గా ప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌

►స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం.. గడ్డం ప్రసాద్‌కు సభలో సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

►అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌.

►బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా, కేటీఆర్‌, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌, పద్మారావు గౌడ్‌, పల్లా రాజేశ్వర్‌  ప్రమాణం

►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

►సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. 

►తెలంగాణ సచివాలయానికి ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ వచ్చారు. మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆమె అక్కడే ఉన్నారు. 

►తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ ఎన్నిక విషయాన్ని అనౌన్స్‌ చేస్తారు. 

►కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్‌ను సీఎం, మంత్రులు అధికార ప్రతిపక్ష సభ్యులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం.. స్పీకర్ గుణగణాలు.. ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావిస్తారు. మరోవైపు.. 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతు తెలిపారు.

►వీరిలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ మిత్రపక్షం మద్దతు ఉండగా.. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ఎన్నికకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు. ఇక, స్పీకర్ ఎన్నికకు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. 

►అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

►ఇదిలా ఉండగా.. ఈరోజు మంచి రోజు కావడంతో ఛార్జ్ తీసుకోనున్న పలువురు మంత్రులు. 

►ఉదయం ఏడున్నరకు మంత్రి శ్రీధర్ బాబు, ఎనిమిదిన్నరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకోనున్నారు. 

►ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాద్యతలు తీసుకోనున్నారు. 

►నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.

►ఉదయం 11.30 గంటలకి అసెంబ్లీలో కేబినెట్‌ భేటీ.

►గవర్నర్ ప్రసంగంపై కేబినెట్‌లో చర్చించనున్న మంత్రులు

>
మరిన్ని వార్తలు