Parliament Session: లోక్‌సభ దాడి ఘటన.. పార్లమెంట్‌ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌

14 Dec, 2023 18:42 IST|Sakshi

Live Updates..

లోక్‌సభ ఘటన నిందితులకు కస్టడీ 

  • నలుగురు నిందితులకు కస్టడీ విధింపు
  • ఏడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీ విధించిన కోర్టు
  • పార్లమెంట్‌ సమావేశాల్లో.. బుధవారం మధ్యాహ్నాం అలజడి సృష్టించిన ఇద్దరు
  • బయట నినాదాలతో మరో ఇద్దరి నిరసన

లోక్‌సభ రేపటికి వాయిదా

  • సభ్యుల నిరసనలతో లోక్‌సభ రేపటికి వాయిదా
  • ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలను సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ ఓం బిర్లా
  • సభా నియమాలను ఉల్లంఘన, సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారనే ఈ నిర్ణయం
  • తిరిగి శుక్రవారం ఉదయం 11గం. ప్రారంభం కానున్న లోక్‌సభ


రాజ్యసభ మళ్లీ వాయిదా

  • సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ 3గం. ప్రారంభమైన రాజ్యసభ
  • టీఎంసీ ఎంపీ  డెరెక్ ఓ'బ్రియన్ సస్పెన్షన్‌ ప్రకటన తర్వాత వాయిదా పడ్డ సభ
  • ఓ'బ్రియన్ చేష్టలు సిగ్గుచేటుగా అభివర్ణించిన చైర్మన్‌ ధన్‌కడ్‌
  • చైర్మన్‌ ఆదేశాల్ని ధిక్కరించారని మండిపాటు
  • గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ.. 4గం. ప్రారంభం అయ్యే ఛాన్స్‌
     

ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌

  • లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
  • సస్పెండ్‌ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
  • సస్పెండ్‌ అయిన ఎంపీలు టీఎన్‌ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్
  • ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు మొదటి నుండి జరుగుతున్నాయి: ప్రహ్లాద్‌ జోషి
  • నినాదాలు చేయడం, కాగితాలు విసిరివేయడం గ్యాలరీ నుంచి దూకడం కొందరు చేస్తున్నారు: ప్రహ్లాద్‌ జోషి
  • లోక్ సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

పార్లమెంట్‌లో ఫుల్‌ ఆంక్షలు

  • పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు
  • లోక్‌సభలో నిన్నటి భద్రత వైఫల్యంతో ప్రతిబంధకాలు విధించిన సిబ్బంది 
  • పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు
  • ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ , పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార   
  • సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు
  • ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు 
  • ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని సస్పెండ్ చేసిన పార్లమెంట్ సెక్రటేరియట్ 
  • ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 
  • భద్రతా వైఫల్యంపై  హోం మంత్రి అమిత్‌ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్

టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌

  • రాజ్యసభలో టీఎంసీ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ 
  • రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినందుకు సస్పెన్షన్ వేటు 
  • ఒబ్రెయిన్‌ సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన
  • సభా కార్యక్రమాలు మధ్యాహ్నానికి వాయిదా

►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా

►పార్లమెంట్‌లో దాడి ఘటనపై లోక్‌సభలో గందరగోళం

►దాడి ఘటనపై లోక్‌సభలో అమిత్‌ షా మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌. దాడి బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు. 

►పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం. 

పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది సస్పెండ్‌

  • పార్లమెంట్‌లో దాడి నేపథ్యంలో కేంద్రం సీరియస్‌
  • పార్లమెంట్‌ సిబ్బందిపై చర్యలు
  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్‌

►కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. అమిత్‌ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్‌ జోషీ, అనురాగ్‌ ఠాకూర్‌తో మోదీ భేటీ.

►ఖర్గే చాంబర్‌లో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. లోక్‌సభలో దాడి నేపథ్యంలో సభలో వ్యహరించాల్సిన వ్యూహంపై చర్చ. 

►పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలు. భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభలో రూల్‌ 267 కింద బిజినెస్‌ సస్పెన్షన్‌ నోటీస్‌ ఇచ్చిన ఎంపీ రాజీవ్‌ శుక్లా. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి.

►పార్లమెంట్‌లో దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు

►కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుండి ఎటువంటి ప్రకటనలు లేవు, ఈ ఘటనపై సభలో చర్చ జరగాలన్నారు. 

►ఈ ఘటనపై ఇండియా కూటమి పార్లమెంటరీ పక్షనేతల సమావేశం

►పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ

►లోక్‌సభలో దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్‌ కోరిన కూటమి నేతలు

►పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలు

►పార్లమెంట్‌లో దాడి ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. 

►నూతన పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు ఉండగా.. పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 

►పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

>
మరిన్ని వార్తలు