ఎంజీఎంలో బాలుడి మృతి.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

8 Sep, 2022 12:53 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల విహాన్‌ (8) అనే బాలుడు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అనిల్‌బాల్‌రాజు, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ రంగస్వామిలతో అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌ఐసీయూలోని స్టాఫ్‌నర్సులు, అనస్తీషియా విభాగాధిపతి, ఆర్థో విభాగాధిపతులతో మాట్లాడారు. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. విహాన్‌ కేసు పూర్వాపరాలను మంత్రి హరీశ్‌­రావు, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం

మరిన్ని వార్తలు