గూప్‌1,2 ఉద్యోగాలను భర్తీ చేయండి 

19 Oct, 2021 03:53 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య 

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా గ్రూప్‌1,2 ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని బీసీ సంక్షేమ సంఘం విమర్శించింది. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యో గుల వయో పరిమితి ముగిసిపోతుందని, అందుకే తక్షణం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ కింద ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది.

ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో సంఘం నేతలు గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్, ఉదయ్‌ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి ఉద్యోగాల భర్తీపై వినతిపత్రం సమర్పించారు.  తమ వినతిపై స్పందించిన సీఎస్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.   

మరిన్ని వార్తలు