సీఎం సభను ఎవరూ అడ్డుకోలేదు: కిషన్‌రెడ్డి

27 Oct, 2021 02:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్‌ సభను తామెవరమూ అడ్డుకోలేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం వావిలాల, నాగంపేట కోరపల్లి, మడిపల్లి, జమ్మికుంట పట్టణంలో జరిగిన రోడ్‌ షోల్లో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి అయిన తాను కూడా ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధ నల మేరకు కేవలం రోడ్‌ షోలే నిర్వహిస్తు న్నానని చెప్పారు.

హుజూరాబాద్‌ ఎన్నికల్లో నియంతృత్వం నెగ్గుతుందా.. ప్రజాస్వామ్యం గెలుస్తుందా.. అని దేశమంతా ఎదురు చూస్తోందన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేం దర్‌ నిజాయితీపరుడని, కేసీఆర్‌ చేస్తున్న తప్పు లను ప్రశ్నించినందుకే ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని చూశారని ఆరో పించారు. నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉండే రాజేందర్‌ను గెలిపించాలని కిషన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కేంద్రమే మొత్తం నిధులను సమకూరుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. కాగా, వావిలాలలో ఎంతో ప్రసిద్ధి పొందిన చేనేత వస్త్రాలయంలో కిషన్‌రెడ్డి ఖాదీ దుస్తులు కొనుగోలు చేశారు. 

మరిన్ని వార్తలు