RATION SHOP: ఇక ఉచిత బియ్యం 5 కిలోలే 

5 Jul, 2021 14:46 IST|Sakshi

నేటి నుంచి రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ

27 వరకు బియ్యం డ్రా చేసుకునే వీలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ఈ నెల కూడా ఉచితంగా అందనున్నాయి. సాధారణ నెలవారీ కోటాలో మాత్రం ఉచితం కారణంగా యూనిట్‌కు ఒక కిలో చొప్పున కోత పడింది. కరోనా నేపథ్యంలో ఆహార భద్రత కార్డులోని యూనిట్‌కు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సోమవారం నుంచి ఉచిత బియ్య​​ం కోటా పంపిణీ ప్రారంభం కానుంది. వాస్తవంగా ఆహార భధ్రత (రేషన్‌) కార్డుదారులకు కిలో ఒక్కింటికి రూ.1 లెక్కన.. యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ వస్తోంది. కరోనా కష్టకాలం నేపథ్యంలో జాతీయ ఆహార చట్టం పరిధిలోని కార్డుదారుల కు కేంద్రం 5 కిలోల ఉచిత బియ్యం ప్రకటింంది. కేంద్ర పరిధితో పాటు రాష్ట్ర పరిధిలోని కార్డులు కూడా ఉండటంతో అందరికి ఒకే రకంగా ఉతం బియ్యం కోటాను పంపిణీ చేసేందుకు 5 కిలోలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆహార భద్రత కార్డుదారులందరికి యూనిట్‌కు 5 కిలోల చొప్పున పంపిణీ జరగనుంది. ఈ నెల 27 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కోటాను డ్రా చేసుకునేలా పౌరసరఫరాల శాఖ వెసులుబాటు కల్పించింది. 

మరిన్ని వార్తలు