రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు  91,607

12 Sep, 2021 04:29 IST|Sakshi

అందుబాటులోని బీఫార్మసీ సీట్లు 4,550 

కాలేజీలు, సీట్ల జాబితాలు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో కలిపి 91,607 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది. బీ ఫార్మసీ సీట్లు 4,550 ఉన్నట్టు వెల్లడించింది. జేఎన్టీయూహెచ్‌ పరిధిలో 141 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు, 71 ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బీటెక్‌ సీట్లకు త్వరలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో.. ఆయా కాలేజీలు, సీట్ల వివరాలను ప్రకటించింది. 

బీ ఫార్మసీకి సంబంధించి.. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు వర్సిటీల పరిధిలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఈ వర్సిటీల అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలు 109 ఉండగా.. వాటిలో 4,470 సీట్లు ఉన్నాయి. ఇందులో 3,130 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. 
ఫార్మాడీ కోర్సులో వర్సిటీల అనుబంధ గుర్తింపు పొంది న కాలేజీలు 53కాగా.. వాటిల్లో 741 సీట్లు ఉన్నాయి. ఇందులో 520 సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు.  

మరిన్ని వార్తలు