హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు: వెంకయ్య నాయుడు

12 Sep, 2022 11:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. 

కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్‌ స్టార్‌ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్‌లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతర​ం, సోము వీర్రాజు మీడియాతో​ మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్‌ స్టార్‌ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు