వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు

2 Aug, 2021 03:01 IST|Sakshi
టైలరింగ్‌ చేస్తున్న మహిళలతో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి

శంషాబాద్‌: వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువత నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జీఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున్‌రావు స్వాగతం పలికారు. ఫౌండేషన్‌లో వివిధ కోర్సుల శిక్షణ తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్‌ శిక్షణ తీసుకుని అక్కడే పనిచేస్తున్న మహిళలతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం బాగుందని కితాబిచ్చారు. తర్వాత జీఎంఆర్, చిన్మయ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో వెంకయ్యనాయుడు మొక్కను నాటారు.

మరిన్ని వార్తలు