ఓటు కోసం తరలిన ఓటర్లు.. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. బస్సులు తక్కువే?

30 Nov, 2023 10:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తెలంగాణ ఎన్నికల తమ వంతుగా ఓట్లు వేసేందుకు ఓటర్లు కదిలారు. భాగ్యనగరం నుంచి తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో, బస్సు, రైళ్లు నిండిపోయాయి. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఉన్న కొద్ది బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండంతో స్థలం సరిపోక.. బస్సులపైకి ఎక్కి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తాజాగా ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద.. బస్సుపైకి ఎక్కి ప్రయాణికులు ఇళ్లకు వెళ్తున్నారు. 

మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో, రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు భారీ తరలివెళ్తున్న ప్రజలు. ఔటర్‌ వైపు భారీగా చేరుకుంటున్న వాహనాలు. 
 

మరిన్ని వార్తలు