రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు 

10 May, 2022 02:49 IST|Sakshi

‘అసని’తుపాను ప్రభావంతో మూడురోజులు కాస్త తగ్గనున్న ఉష్ణోగ్రతలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుపాను ప్రభావం రాష్ట్రంపై  లేకున్నా వాతావరణంలో మార్పులు జరుగుతాయ ని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గొచ్చని, రానున్న మూడ్రోజులు చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంది. సోమవారం  ఆదిలాబాద్‌లో గరిష్టంగా 42.2 డిగ్రీలు, హకీంపేట్‌లో కనిష్టంగా 23.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.    

మరిన్ని వార్తలు