రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. అమ్మగారింటికి వెళుతున్నానని చెప్పి

6 May, 2022 18:40 IST|Sakshi
మమత

సాక్షి, హైదరాబాద్‌: భర్తతో గొడవపడి మనస్తాపానికి గురైన ఓ యువతి అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.ఏఎస్సై సాయన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి స్ట్రీట్‌నెంబర్‌ 2లో నివాసం ఉండె సాయి కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం మమత(21)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 12 ఇద్దరూ చిన్న విషయంలో గొడవ పడ్డారు.

13వ తేదీన డ్యూటీలో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి రంగారెడ్డి జిల్లా పరిగిలో ఉంటున్న అమ్మగారింటికి వెళుతున్నానని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో భార్య సోదరికి ఫోన్‌ చేసి అడగగా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో సాయి కృష్ణ ఫిర్యాదు చేయడంతో మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: హైదరాబాద్‌ ఇరానీ చాయ్‌: ఇలా పెంచేశారేం‘టీ’..? 

మరిన్ని వార్తలు