ఇంజక్షన్‌ చేసిన తర్వాతే స్వాతికి మాటలు రాలేదు..

11 Oct, 2023 11:44 IST|Sakshi

వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్‌ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్‌ స్రవంతి నర్సింగ్‌ హోమ్‌లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్‌ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్‌ వచ్చాయి. అయితే ప్లేట్స్‌ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్‌ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్‌ ఇవ్వగా ఆమె మృతి చెందింది. 

ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్‌ను నిలదీశారు. ఇంజక్షన్‌ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్‌ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు.

 ఒక్కొకసారి రిపోర్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్‌ చేసి వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. 

మరిన్ని వార్తలు